Header Banner

ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు..! పెన్షన్ దారులకు సులభతరం!

  Thu Feb 27, 2025 19:31        Politics

ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లలో ఈ మార్పులు వర్తింపచేయనున్నారు. పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నట్లు సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. ఇందులో టైమింగ్స్ మార్పు సహా పలు అంశాలున్నాయి. పెన్షన్ల పంపిణీలో నాణ్యత, పెన్షన్ దారుల సంతృప్తి మెరుగుపర్చేందుకు పెన్షన్ల పంపిణీ యాప్ లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పెన్షన్ పంపణీ యాప్ లో 20 సెకన్ల ఆడియో పెట్టినట్లు తెలిపింది. పెన్షన్ ఇచ్చే ముందు లబ్దిదారులకు సీఎం చంద్రబాబు సందేశంతో కూడిన ఈ ఆఢియో వినిపించాలని ఆదేశించింది. అలాగే వృద్ధ పెన్షన్ దారులకు పెన్షన్ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు నమస్కారాలు తెలియజేయాలని తెలిపింది.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


అలాగే పెన్షన్ దారుల ఇంటికి 300 దూరంలో పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్ లోనే నోట్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. అలాగే పెన్షన్ దారుల సౌలభ్యం కోసం ఉదయం 6 గంటలకు బదులుగా 7 గంటలకు పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. అధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించడం ద్వారా పెన్షన్ దారులకు సంతృప్తికరంగా వాటిని పంపిణీ చేయాలని సెర్ఫ్ సీఈవో కరుణ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని సచివాలయాలు, ఇతర అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పెన్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తోంది. ఇప్పటికే అనర్హులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారిని జాబితా నుంచి తొలగిస్తోంది. ఇప్పుడు తాజా మార్పులతో అర్హులకు సంతృప్తి కరంగా పెన్షన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!


మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!


ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #pension #distibution #changes #todaynews #flashnews #latestnews